శుక్రవారం 13 మార్చి 2009

సంత్యన్వేషి [ఐ.ఎ. ఎస్ ]

సత్యాన్వేషి [ఐ.ఎ. ఎస్ ]
నాపేరు కళ్యాణ్ మాది కడపజిల్లా పులివెందులకు పదికిలోమీటర్లు దూరంలో వున్ననరసింహాపురం మాగ్రామం. మాకుటుంబంలో నాన్న రామ చంద్రయ్య ,అమ్మ లక్ష్మి, అన్నయ్య రామకృష్ణ , చెల్లెలు ఉదయ్ చంద్రిక , నాన్న వ్యవసాయం ,అమ్మకి ఇల్లు చక్కదిద్దుకునేసరికి చాల టైం పట్టిద్ధి అప్పుడప్పుడు నాన్నతోపాటు పోలంలోపనికి కూడా వెళుతుంది . అమ్మ,నాన్న ఇద్దరుకూడా చదువుకోలేదు . అందుకే మాముగ్గురిని వున్నత చదువులు చదివించాలి అని వారి శక్తికి మించ్చిన చదువులు మాకువున్న ఐదు యకరలభూమిని మా ఇంటిని తాకట్టుపెట్టి ఆడబ్భుతో మా ముగ్గురిని వున్నత చదువులు ( అన్నయ్య రామక్రిష్ణని ఎలెక్త్రికల్ ఇంజనీరింగ్ , ఉదయ్ చంద్రికని ఎం.ఎస్,సి ,కల్యాన్ని అంటే నన్ను ఐ.ఎ.ఎస్ చదివించారు ) .
అన్నయ్య రామకృష్ణ ఇంజనీరింగ్ చదివి జాబ్ కోసం వెయ్ట్ చేస్తూ నాన్నగారికి వ్యవసాయంలో సాయం చేస్తూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ప్రేమించిన అమ్మాయితో జాలీగా జీవితం సాగిస్తున్నాడు, మాచేల్లెలు ఉదయ్ ఎం.ఎస్. సి. పూర్తి చేచి పులివెందుల లో ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో జూనియర్ ఫిజిక్స్ టీచర్ గా జాబ్ చేస్తూ నా ఐ.ఎ. ఎస్. చదువుకి హెల్ప్ అవుతుంది .